: విజయవాడలో చంద్రబాబుతో కలసి లంచ్ చేయనున్న కేసీఆర్!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో కలిసి తెలంగాణ సీఎం కేసీఆర్ రేపు మధ్యాహ్నం లంచ్ చేయనున్నారు. త్వరలో నిర్వహించనున్న అయుత చండీయాగానికి చంద్రబాబును ఆహ్వానించే నిమిత్తం కేసీఆర్ రేపు విజయవాడకు వెళ్లనున్నారు. రేపు ఉదయం 11.30 గంటలకు బేగం పేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లో కేసీఆర్ బయల్దేరతారు. ఆయన వెంట కొందరు పార్టీ నేతలు కూడా వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు క్యాంప్ ఆఫీసులో చంద్రబాబును కేసీఆర్ కలవనున్నట్లు సమాచారం. లంచ్ అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు హైదరాబాద్ కు కేసీఆర్ తిరుగుపయనం కానున్నట్లు అధికారులు పేర్కొన్నారు.