: నటుడు శోభన్ బాబు కాంస్య విగ్రహావిష్కరణ
ఆంధ్రుల అందాల నటుడు దివంగత శోభన్ బాబు క్రమశిక్షణ కల్గిన నటుడని సినీ నటుడు, రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ కొనియాడారు. విజయవాడ గాంధీనగర్ సెంటర్ లో శోభన్ బాబు కాంస్య విగ్రహాన్ని ఈరోజు ఆయన ఆవిష్కరించారు. శోభన్ బాబు అభిమానుల సంఘం ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మంత్రి దేవినేని ఉమాతో కలిసి ఈ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ, శోభన్ బాబు అనగానే మన అందరికీ కనబడేది ఒక అందాల హీరో అని, ఒక చక్కని నటుడు అని, అలాంటి వ్యక్తి అభిమానుల అందరి గుండెల్లో ఉండాలని.. ముఖ్యంగా మహిళల గుండెల్లో ఆయన ఉండాలని అన్నారు. శోభన్ బాబు మృతి చెంది సుమారు పదేళ్లు అవుతున్నప్పటికీ, అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండటం చాలా గొప్ప విషయమన్నారు.