: బయట వ్యక్తుల నుంచి రుణాలు తీసుకోవద్దు: కాల్ మనీ పై గవర్నర్ స్పందన


కాల్ మనీ వ్యవహారంపై తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ స్పందించారు. బయట వ్యక్తుల నుంచి ఎవ్వరూ రుణాలు తీసుకోవద్దని, ప్రభుత్వ సంస్థ నుంచే అందరూ రుణాలు తీసుకోవాలని ఆయన సూచించారు. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలంలోని యల్లమందలో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అక్కడి డంపింగ్ యార్డుకు ఆయన శంకుస్థాపన చేశారు. వ్యక్తిగత మరుగుదొడ్ల లబ్ధిదారులతో ముఖాముఖిలో గవర్నర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యక్తిగత మరుగుదొడ్లను అందరూ వినియోగించుకోవాలని, ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మద్యానికి అందరూ దూరంగా ఉండాలన్నారు.

  • Loading...

More Telugu News