: ఆ సైనికుల త్యాగం మరువలేనిది... వారికి నా సెల్యూట్: రాజ్ నాథ్ సింగ్


భారత పార్లమెంటుపై ఉగ్రవాదుల దాడి జరిగి నేటికి సరిగ్గా 14 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు ఆనాడు అమరులైన వీరులకు నివాళులు అర్పించారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు డిసెంబర్ 13, 2001న పార్లమెంటుపై దాడికి తెగబడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో తమ ప్రాణాలను లెక్కచేయకుండా వారికి అడ్డుపడి మరణించిన సైనికుల త్యాగం మరువలేనిదని, వారికి తాను ఎల్లప్పుడూ సెల్యూట్ చేస్తానని హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని అమర వీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఉగ్రవాదరహిత ప్రపంచం కోసం తాము కృషి చేస్తామని, దేశాన్ని సురక్షితంగా ఉంచుతామని ఈ సందర్భంగా రాజ్ నాథ్ హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News