: పాక్ తో చర్చలు జరపాల్సిందే...వేరే మార్గం లేదు: ముఫ్తీ మహబూబా
పాకిస్థాన్ తో భారత్ చర్చలు జరపాల్సిందేనని జమ్మూకాశ్మీర్ లోని పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ తెలిపారు. జమ్మూలో ఆమె మాట్లాడుతూ, చర్చలు తప్ప భారత్ కు మారో మార్గం లేదని అన్నారు. ఐఎస్ఐఎస్, లష్కరే తోయిబా, తాలిబన్, అల్ ఖైదా వంటి తీవ్రవాద సంస్థలు విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో పొరుగునున్న పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాలతో భారత్ చర్చలు జరపడం తప్ప వేరే గత్యంతరం లేదని అన్నారు. భారత్ పాక్ మధ్య సంబంధాలు సరిగా లేని పక్షంలో ఆ ప్రభావం దేశం మీద పడుతుందని ఆమె పేర్కొన్నారు.