: ఒళ్లు దగ్గర పెట్టుకుంటే సంపత్ నంది మరిన్ని హిట్లు ఇస్తాడు: పోసాని
టాలీవుడ్ దర్శకుడు సంపత్ నందికి మంచి విజయాలు వచ్చాయని నటుడు పోసాని కృష్ణమురళి తెలిపారు. బెంగాల్ టైగర్ ప్రమోషన్ లో పాల్గొన్న సందర్భంగా పోసాని మాట్లాడుతూ, సంపత్ నంది టాలీవుడ్ లో మంచి స్థానం సంపాదించాడని అన్నారు. వీవీ వినాయక్, పూరీ జగన్నాథ్ వంటి కమర్షియల్ దర్శకుల సరసన సంపత్ నంది నిలిచాడని, అయితే ఒళ్లు దగ్గర పెట్టుకుని మరింత జాగ్రత్తగా సినిమాలు చేస్తే మరిన్ని హిట్లు ఇచ్చి, మరింత ఎత్తుకు ఎదుగుతాడని, ఏ మాత్రం గర్వం వచ్చినా పరాజయం పాలవుతాడని హెచ్చరించారు. తన శిష్యుడు మంచి స్థాయిలో ఉన్నాడంటే గురువుకు గర్వకారణమని, సంపత్ నందిని చూస్తుంటే చాలా గర్వంగా ఉందని పోసాని చెప్పారు. సంపత్ నంది తన దగ్గర 29వ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడని పోసాని కృష్ణమురళి తెలిపారు.