: విజయరామారావు ఇంటికెళ్లిన కేటీఆర్


టీడీపీ మాజీ నేత కె.విజయరామారావు ఇంటికి టీఆర్ఎస్ నేత, మంత్రి కేటీఆర్ వెళ్లారు. టీడీపీకి రాజీనామా చేసిన విజయరామారావును టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించేందుకు ఆయన నివాసానికి చేరుకుని చర్చలు జరిపారు. తనను టీఆర్ఎస్ లోకి ఆహ్వానించినందుకు ధన్యవాదాలని విజయరామారావు తెలిపారు. పార్టీలో చేరే విషయంపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని ఆయన కేటీఆర్ కు చెప్పారు. అలాగే హైదరాబాదును అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు టీఆర్ఎస్ తో కలిసి పని చేస్తానని ఆయన తెలిపారు. కాగా, టీఆర్ఎస్ లో విజయరామారావు సహా ఆయన కుమార్తె అన్నపూర్ణకు కూడా సముచిత స్థానం కల్పిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News