: అఖిలేష్ కు థ్యాంక్స్ చెప్పిన అమ్మ


ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ సింగ్ యాదవ్ కు తమిళనాడు సీఎం జయలలిత కృతజ్ఞతలు తెలిపారు. వరదబాధితుల సహాయార్థం అఖిలేష్ రూ. 25 కోట్ల విరాళం ప్రకటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి ఈ మొత్తాన్ని అందించారు. వరదలతో అతలాకుతలమైన ప్రాంతాలను మామూలు స్థితికి తేవడానికి తమ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని... ఈ సమయంలో బాధితులను ఆదుకోవడానికి మీరు చేసిన సహాయానికి కృతజ్ఞతలు అంటూ జయ ధన్యవాదాలు తెలిపారు.

  • Loading...

More Telugu News