: మల్లాది విష్ణు కోసం పోలీసుల వేట... హైదరాబాదు, కటక్ లో ముమ్మర సోదాలు


విజయవాడలో కలకలం రేపిన కల్తీ మద్యం కేసులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అరెస్ట్ కు దాదాపు రంగం సిద్ధమైంది. కల్తీ మద్యం ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, 29 మంది దాకా తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. నగరంలోని కృష్ణలంకలో మల్లాది విష్ణు సోదరుడు మల్లాది శ్రీనివాస్ పేరిట ఏర్పాటైన స్వర్ణ బార్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిన్న సాయంత్రం మల్లాది శ్రీనివాస్ ను అరెస్ట్ చేశారు. ఇక ఈ బార్ వ్యవహారాల్లో మల్లాది విష్ణుకు కూడా పాత్ర ఉందని బలంగా విశ్వసిస్తున్న పోలీసులు దానికి సంబంధించిన ఆధారాలను కూడా సేకరించినట్లు సమాచారం. పక్కా ఆధారాలు లభించిన నేపథ్యంలో మల్లాది విష్ణు అరెస్ట్ కు పోలీసులు రంగం సిద్ధం చేశారు. అయితే ఈలోగానే మల్లాది విష్ణు నగరం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయినట్లు సమాచారం. హైదరాబాదు లేదా ఒడిశా లోని కటక్ లో ఆయన ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసు బాసులు నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దింపారు. మల్లాది విష్ణు ఆచూకీ కోసం ఈ బృందాలు హైదరాబాదు, కటక్ లలో ముమ్మరంగా గాలిస్తున్న వార్తలు వినిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News