: విజయరామారావుకు చంద్రబాబు ఫోన్... పార్టీ మారే విషయంలో తొందరపడొద్దని సూచన
తెలంగాణ రాజకీయాల్లో వేగంగా మారుతున్న పరిణామాలపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు దృష్టి సారించారు. నిన్న పార్టీకి రాజీనామా చేసిన సీబీఐ మాజీ డైరెక్టర్, మాజీ మంత్రి విజయరామారావు టీఆర్ఎస్ లో చేరేందుకు దాదాపు రంగం సిద్ధం చేసుకున్నారు. గ్రేటర్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ పరిణామం టీడీపీకి భారీ నష్టానే మిగిల్చనుంది. ఇప్పటికే సాయన్న టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరిపోయారు. తాజాగా విజయరామారావు కూడా అదే బాటలో పయనిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగారు. కొద్దసేపటి క్రితం విజయరామారావుకు చంద్రబాబు స్వయంగా ఫోన్ చేశారు. పార్టీ మారే విషయంలో తొందరపడొద్దని సూచించారు. నేరుగా చంద్రబాబు నుంచే ఫోన్ రావడంతో విజయరామారావు సందిగ్ధంలో పడ్డారు. చంద్రబాబు చెప్పిన మాటలను సాంతం విన్న విజయరామారావు, ఆలోచించి నిర్ణయం చెబుతానని బదులిచ్చారు.