: చంద్రబాబును దూషించిన వైసీపీ ఎమ్మెల్యే ఈశ్వరిపై కేసు


ఏపీ సీఎం చంద్రబాబును పరుష పదజాలంతో దూషించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై కేసు నమోదైంది. విశాఖ జిల్లా చింతపల్లి పోలీస్ స్టేషన్ లో 124(ఎ) 307, 506, 511 సెక్షన్ ల కింద కేసు నమోదు చేశామని చింతపల్లి సీఐ సీహెచ్ రుద్రశేఖర్ తెలిపారు. రెండు రోజుల కిందట(గురువారం) చింతపల్లి ఆర్టీసీ మైదానంలో వైసీపీ బాక్సైట్ వ్యతిరేక సభ నిర్వహించింది. సభలో పాల్గొన్న ఆ పార్టీ అధినేత జగన్ సమక్షంలో ఈశ్వరి మాట్లాడుతూ, మన్యంలో బాక్సైట్ తవ్వకాలు చేపడితే సంప్రదాయ ఆయుధాలతో సీఎం చంద్రబాబు తల తెగనరుకుతామని ఉద్వేగంతో అన్నారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. వాటి ఆధారంగానే కేసులు నమోదు చేశామని సీఐ చెప్పారు.

  • Loading...

More Telugu News