: నేనూ సల్మాన్ ఖాన్ లాంటి వాడినే... త్వరలోనే బయటపడతా!: ఆశారాం బాపు


అత్యాచార ఆరోపణలతో అరెస్టై జైలు ఊచలు లెక్కిస్తున్న ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘హిట్ అండ్ రన్’ కేసులో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ బయటపడిన మాదిరిగానే తాను కూడా కడిగిన ముత్యంలా బయటపడతానని పేర్కొన్నారు. అంతేకాక తాను కూడా సల్మాన్ ఖాన్ లాంటివాడినేనని ఆయన పేర్కొన్నారు. నిన్న కోర్టు విచారణ కోసం వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నేనూ సల్మాన్ ఖాన్ లాంటి వాడినే. త్వరలోనే కడిగిన ముత్యంలా బయటపడతా’’ అంటూ ఆయన చెప్పారు. ఇండోర్ లోని తన ఆశ్రమంలో ఓ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో అరెస్టైన ఆశారాం బాపు దాదాపు రెండేళ్లుగా జోధ్ పూర్ జైల్లో ఉంటున్నారు.

  • Loading...

More Telugu News