: ప్రత్యేక హోదా డిమాండ్లు చాలా ఉన్నాయి: కేంద్రం
ప్రత్యేకహోదా డిమాండ్లు చాలా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం పార్లమెంటులో ప్రవేశపెట్టిన సందర్భంగా ప్రధాని చేసిన ప్రత్యేక హోదా ప్రకటనపై వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పార్లమెంటులో కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా కేంద్రం ప్రకటన చేస్తూ, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక ప్యాకేజీ కింద 700 కోట్ల రూపాయలు ఇచ్చామని, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి 1850 కోట్ల రూపాయలు విడుదల చేశామని కేంద్రం వెల్లడించింది. ప్రత్యేకహోదా కావాలంటూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయని పార్లమెంటుకు కేంద్రం తెలిపింది. అదే సమయంలో ఏపీకి ప్రత్యేకహోదాపై ఏ విధమైన సమాధానం చెప్పకపోవడం విశేషం.