: 'చంపుతా'మంటూ షబ్బీర్ అలీకి బెదిరింపు ఫోన్ కాల్


కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీకి చంపుతామంటూ బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో ఆయన హైదరాబాదు, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. హైదరాబాదులో ఉంటున్న షబ్బీర్ అలీ ఫోన్ నెంబర్ కు 040 69542335 నెంబర్ నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే చంపుతామని అందులో హెచ్చరించారు. దీంతో ఆయన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

  • Loading...

More Telugu News