: గర్భం తొలగించిన మాట నిజమే అయితే, నా కూతుర్ని చంపే ఉంటాడు: జియాఖాన్ తల్లి


బాలీవుడ్ నటి జియాఖాన్ కేసును ముంబయి పోలీసులు తప్పుదోవ పట్టించారని జియాఖాన్ తల్లి రబియా ఖాన్ ఆరోపించారు. ముంబయిలోని తన స్నేహితుల అపార్టుమెంట్ లో ఉన్న ఆమె ఉద్వేగంగా విలేకరులతో మాట్లాడారు. తన కూతురు జియా ఖాన్ కేసు దర్యాప్తు వ్యవహారాన్ని ముంబయి పోలీసులు పూర్తిగా భ్రష్టుపట్టించారని ఆమె మండిపడింది. తన కూతురిపై దారుణం జరిగిందనడానికి ఇప్పుడు సీబీఐ దర్యాప్తులో లభించిన సాక్ష్యాధారాలే నిదర్శనమన్నారు. ఈ సాక్ష్యాధారాలను తాను కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు ఆమె చెప్పారు. ‘సీబీఐ చెబుతున్నట్లుగా తన బిడ్డ గర్భాన్ని సూరజ్ పంచోలి తన చేతులారా తొలగించి ఉంటాడనే మాట వాస్తవం అయితే.. అతను ఖచ్చితంగా నా బిడ్డను చంపే ఉంటాడు’ అని రబియా ఖాన్ పేర్కొంది. తన కూతురి కేసులో సాక్ష్యాధారాలను కోర్టులో ప్రవేశపెట్టేవరకు జుహులోని తన నివాసానికి తాను వెళ్లలేనని.. అక్కడ ఒంటరిగా ఉండలేనని ఆమె వాపోయింది.

  • Loading...

More Telugu News