: తిరుమల తల నీలాల ఆదాయం 26.11 కోట్లు
తిరుమల వెంకటేశ్వర స్వామికి నవంబర్ నెలలో భక్తులు సమర్పించిన తలనీలాల ద్వారా సమకూరిన ఆదాయం 26.11 కోట్ల రూపాయలని టీటీడీ తెలిపింది. ప్రతి నెల మొదటి గురువారం నాడు ఇంటర్నెట్ ద్వారా టీటీడీ అధికారులు తలనీలాలకు ఈ వేలం నిర్వహిస్తారు. అయితే, ఈ నెల 3న నిర్వహించాల్సిన ఈ వేలం చెన్నైలో వరదల కారణంగా వాయిదా వేశారు. ప్రస్తుతం చెన్నై కోలుకోవడంతో నిన్న ఈ వేలం నిర్వహించారు. అన్ని రకాలు కలిపి 30, 800 కిలోల తలనీలాలు అమ్ముడు కాగా, టీటీడీకి 26.11 కోట్ల రూపాయల ఆదాయం సమకూరిందని టీటీడీ జేఈవో శ్రీనివాసరావు తెలిపారు.