: చంద్రబాబుపై వ్యాఖ్యలకుగానూ వైసీపీ క్షమాపణ చెప్పాలి: జూపూడి
ఏపీ సీఎం చంద్రబాబుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి చేసిన పరుష వ్యాఖ్యలను టీడీపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. విశాఖ జిల్లా చింతపల్లి బహిరంగ సభలో ఆమె చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని టీడీపీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ అన్నారు. ప్రతిపక్ష నేతలు ఇష్టానుసారం మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ మేరకు జూపూడి మాట్లాడారు. జగన్ సమక్షంలోనే ఎమ్మెల్యే అలా మాట్లాడటం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఈశ్వరి వ్యాఖ్యలను వైసీపీ సమర్థిస్తోందా? అని నిలదీశారు. వెంటనే ఈ వ్యాఖ్యలకుగానూ వైసీపీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాభిప్రాయం భిన్నంగా ఉండటంతో బాక్సైట్ పై కేంద్రం ఇచ్చిన జీవోను నిలిపివేశామని జూపూడి చెప్పారు.