: మార్కెట్ భారీ పతనం... 25 వేల దిగువకు సెన్సెక్స్!
నేటి స్టాక్ మార్కెట్ కుదేలైంది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితికి తోడు, యూఎస్ ఫెడ్ భయాలు, క్రూడాయిల్ ధరల పతనం తదితరాంశాలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును హరించడంతో సెన్సెక్స్ అత్యంత కీలకమైన 25 వేల పాయింట్ల స్థాయి వద్ద మద్దతును కూడగట్టుకోవడంలో విఫలమైంది. ఇదే సమయంలో నిఫ్టీ సూచిక 7,600 దిగువకు పతనమైంది. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో సెన్సెక్స్ 250 పాయింట్ల పతనంతో 24,994 పాయింట్ల వద్ద, నిఫ్టీ 80 పాయింట్ల పతనంతో 7,599 పాయింట్ల వద్దా కొనసాగుతున్నాయి. అక్టోబర్ లో భారత పారిశ్రామికోత్పత్తి గణాంకాలు అంత బాగాలేవని వచ్చిన సంకేతాలు కూడా మార్కెట్ పతనానికి కారణమని నిపుణులు వ్యాఖ్యానించారు. నిఫ్టీ-50లో 41 కంపెనీలు నష్టాల్లో నడుస్తున్నాయి.