: జీహెచ్ఎంసీ ఎన్నికలకు ప్రత్యేక మేనిపెస్టో విడుదల చేస్తాం: కేటీఆర్


తెలంగాణలో వరుసగా ఎన్నికల్లో గెలుపు జెండా ఎగురవేస్తున్న టీఆర్ఎస్ రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా విజయం సాధించేందుకు ప్రణాళికలు వేస్తోంది. ఈ ఎన్నికల కోసం టీఆర్ఎస్ ప్రత్యేక మేనిఫెస్టోను రూపొందించి విడుదల చేస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇప్పటికే దానిపై కసరత్తు చేశామని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం ఐదు సర్వేలు చేశామని, ఆ సర్వేలన్నింటిలోను తమ పార్టీకే మెజార్టీ సీట్లు వస్తాయని తేలిందని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసి మేయర్ పీఠం దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఓటింగ్ శాతం పెంచేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడతామని వివరించారు.

  • Loading...

More Telugu News