: ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్కులు ఇవే...!
తెలంగాణ ఉద్యమం నడుస్తున్న సమయంలో రాష్ట్రం ఏర్పడాలంటూ కేసీఆర్ అనేక మొక్కులు మొక్కుకున్నారు. ఇప్పుడు తన మొక్కులు చెల్లించుకోవడానికి... ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. కేసీఆర్ మొక్కుల వివరాలు ఇవే... తిరుమల శ్రీవేంకటేశ్వరుడికి రూ. 5 కోట్ల విలువైన మూలవర్ణ కమలము, బంగారు సాలిగ్రామ హారము, ఐదు పెటల కంటె... తిరుచానూరు పద్మావతి అమ్మవారికి రూ. 30 నుంచి 45 వేలతో బంగారు ముక్కుపుడక... విజయవాడ కనకదుర్గ అమ్మవారికి రూ. 30 నుంచి 45 వేలతో బంగారు ముక్కుపుడక... వరంగల్ కురవి వీరభద్రస్వామికి రూ. 60 నుంచి 75 వేలతో బంగారు మీసాలు... వరంగల్ భద్రకాళి అమ్మవారికి రూ. 57 లక్షల విలువైన 2 కిలోల కిరీటం.