: నాలుగు రోజుల్లో అమ్మకానికి రానున్న టాప్-10 ఆటగాళ్లు వీరే!


ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోకి మరో రెండు కొత్త జట్లు వచ్చి చేరిపోయాయి. పాత జట్లలో రెండు మాయమైపోయాయి. ఐపీఎల్ అవకతవకల నేపథ్యంలో చెన్నై, రాజస్థాన్ జట్లు నిషేధానికి గురికాగా, పుణె, రాజ్ కోట్ ఫ్రాంచైజీలు కొత్తగా వచ్చిన సంగతి తెలిసిందే. ఇక నిషేధానికి గురైన జట్లు ఐపీఎల్ లో మంచి ప్రతిభను కనబరిచి ట్రోఫీలను గెలుచుకున్నవే కావడం, ఆయా జట్లలో ఉత్తమ ఆటగాళ్లు ఉండటంతో, 15న జరిగే ఆటగాళ్ల వేలంలో ఎటువంటి ధర పలుకుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా ఉన్న మహేంద్ర సింగ్ ధోనీకి అత్యధిక ధర వస్తుందని క్రీడా పండితులు భావిస్తున్నారు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం లోయస్ట్ బిడ్ దాఖలు చేసిన పుణె ఫ్రాంచైజీకి తొలి ఆటగాడిని ఎంచుకునే అవకాశం ఉండటంతో, పుణె యాజమాన్యం ధోనీని ఎంచుకోవచ్చని తెలుస్తోంది. ఇక ధోనీతో పాటు అధిక ధర పలికే టాప్-10 ఆటగాళ్లలో సురేష్ రైనా, బ్రాండన్ మెకుల్లమ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, స్టీవ్ స్మిత్, షేన్ వాట్సన్, అజింక్య రహానే, జేమ్స్ ఫాల్కనర్, సంజూ శాంసన్ ఉంటారని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒక్కో ఫ్రాచైజీ రూ. 10 కోట్ల వరకూ వెచ్చించి ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు.

  • Loading...

More Telugu News