: న్యూ ఇయర్ నుంచి పెరగనున్న మారుతి సుజుకి కార్ల ధరలు


ఇండియాలో అత్యధికంగా కార్లను తయారు చేసి విక్రయిస్తున్న మారుతి సుజుకి నూతన సంవత్సరం నుంచి కార్ల ధరలను పెంచనున్నట్టు వెల్లడించింది. విదేశీ మారక ద్రవ్య ఒడిదుడుకుల కారణంగా రూపాయి విలువ పతనం కావడం, విడిభాగాల ధరల పెరుగుదల తదితరాల వల్ల ఉత్పత్తి వ్యయం భారమైనందున కొంతమేరకు కస్టమర్లపై భారం మోపాలని నిర్ణయించినట్టు సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. తాము అందిస్తున్న అన్ని వేరియంట్లపై రూ. 20 వేల వరకూ ధరలు పెరుగుతాయని, జనవరి 1 నుంచి ఈ నిర్ణయం అమలవుతుందని వివరించారు. కాగా, ఇప్పటికే జనవరి నుంచి కార్ల ధరలను రూ. 30 వేల వరకూ పెంచుతున్నట్టు హ్యుందాయ్ మోటార్ కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News