: గుట్టు విప్పుతానన్న హెడ్లీ!... క్షమించేసిన ముంబై కోర్టు


ముంబైలో 2008లో చోటుచేసుకున్న ఉగ్రవాద దాడులకు సంబంధించి నిన్న ముంబైలోని విచారణ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దాడులకు పథక రచన చేయడంలో కీలక భూమిక పోషించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న డేవిడ్ హెడ్లీకి క్షమాబిక్ష ప్రసాదిస్తూ కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే అందుకు కోర్టు ప్రతిపాదించిన అన్ని నిబంధనలకు హెడ్లీ అంగీకరించాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది. ప్రస్తుతం ముంబై దాడుల ఆరోపణలపై అమెరికాలో అరెస్టైన హెడ్లీ 35 ఏళ్ల కఠిన కారాగారవాసాన్ని అనుభవిస్తున్నాడు. నిన్న జరిగిన విచారణలో భాగంగా ముంబై కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హెడ్లీని విచారించింది. ముంబై దాడులకు సంబంధించిన అన్ని విషయాలను వెల్లడిస్తేనే అతడికి క్షమాబిక్ష ప్రసాదిస్తానని కోర్టు ప్రతిపాదించింది. ఇందుకు సమ్మతించిన హెడ్లీ... దాడుల పథక రచనలో తన పాత్రతో పాటు మిగిలిన నిందితులందరి పాత్రపైనా సమగ్ర వివరాలు వెల్లడిస్తానని కోర్టుకు చెప్పాడు. దీంతో కోర్టు అతడిని అప్రూవర్ గా మారుస్తూ క్షమాభిక్ష ప్రసాదించింది. ఈ మేరకు ఫిబ్రవరి 18న జరగనున్న విచారణకు హెడ్లీ ప్రత్యక్షంగా హాజరుకానున్నాడు.

  • Loading...

More Telugu News