: విజయవాడలో ఇళ్లు ఇప్పిస్తామంటూ మోసం... నిందితుల అరెస్టు


ఒక కాలనీలో ఇళ్లు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన విజయవాడలోని జక్కంపూడి కాలనీలో జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జక్కంపూడి కాలనీలో ఇళ్లు ఇప్పిస్తామంటూ ఐదుగురు వ్యక్తులు మాయ మాటలు చెబుతున్నారు. వారి వద్దకు వచ్చే వారిని నమ్మించేందుకు గాను పలు నకిలీ డాక్యుమెంట్లను సృష్టిస్తున్నారన్నారు. నిందితుల వద్ద నుంచి సుమారు కోటి రూపాయల విలువ చేసే డిమాండ్ డ్రాఫ్ట్ లను, రూ.16 లక్షలు, రూ.12 లక్షల విలువైన దస్తావేజులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News