: ‘ప్రకాశం’లో కల్తీ మద్యం స్వాధీనం!
ప్రకాశం జిల్లా టంగుటూరులో కల్తీ మద్యంను ఆబ్కారీ శాఖ అధికారులు గుర్తించారు. స్థానిక వెంకాయనగర్ కాలనీలోని ఒక ఇంట్లో కల్తీ మద్యం కేసులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆబ్కారీ శాఖాధికారులు మాట్లాడుతూ, సుమారు 52 కల్తీ మద్యం కేసులను ఆ ఇంట్లో నుంచి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కాగా, ఇటీవల విజయవాడలోని స్వర్ణ బార్ లో కల్తీ మద్యం బారినపడి పలువురు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించిన విషయం తెలిసిందే. స్వర్ణ బార్ లైసెన్స్ రద్దు చేయడమే కాకుండా, సంబంధిత ఆబ్కారీ శాఖాధికారిపై సస్పెన్షన్ వేటు కూడా వేశారు.