: మాజీ ఎంపీ రాజయ్య కుటుంబ సభ్యులకు బెయిల్ నిరాకరణ
మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు, ఆయన కుటుంబ సభ్యులకు వరంగల్ న్యాయస్థానం బెయిల్ నిరాకరించింది. కోడలు సారిక, మనవళ్లు అభినవ్, అయాన్, శ్రియాన్ ల మరణాల కేసులో ప్రధాన నిందితులుగా రిమాండులో ఉన్న రాజయ్య, ఆయన భార్య మాధవి, కుమారుడు అనిల్ బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నారు. అయితే, వీరి బెయిల్ పిటిషన్ ను న్యాయస్థానం తిరస్కరించింది. వీరికి మరో 14 రోజుల రిమాండును పొడిగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది.