: సింగపూర్ కి చెందిన ఆరు ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టనున్న ఇస్రో


భారత కీర్తి ప్రతిష్ఠలను దిగంతాలకు చాటుతున్న ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది. సింగపూర్ కి చెందిన ఆరు ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. వీటిని డిసెంబర్ 16న నింగిలోకి తీసుకెళ్లనుంది. ఈ ఆరు ఉపగ్రహాల బరువు 625 కేజీలు కాగా, వీటిని పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా నింగిలోకి పంపించనున్నారు. డిసెంబర్ 16 సాయంత్రం ఆరు గంటలకు ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట రాకెట్ లాంఛింగ్ సెంటర్ నుంచి ఈ ఉపగ్రహాలతో పీఎస్ఎల్వీ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది.

  • Loading...

More Telugu News