: 'మన మద్రాస్ కోసం' చేతులు కలిపిన ఓలా క్యాబ్స్!


చెన్నై వరద బాధితులకు సహాయమందించేందుకు గాను ‘మన మద్రాస్ కోసం’ పేరిట టాలీవుడ్ నటులు ఓ కార్యక్రమాన్ని చేబట్టిన సంగతి విదితమే. దీనికి 'ఓలా క్యాబ్స్' కూడా తన మద్దతు తెలిపింది. చెన్నై వరద బాధితులకు సహాయ సామగ్రి పంపించాలనుకునే హైదరాబాద్ ప్రజల కోసం రెండు ఫోన్ నంబర్లను ఇచ్చింది. 040-39594300, 040-30911185 అనే ఫోన్ నంబర్లలో సంప్రదిస్తే ఓలా ఏస్ ట్రక్ ఇంటికి వచ్చి, సహాయ సామగ్రిని సేకరిస్తుందని, తర్వాత వాటిని రామానాయుడు స్టూడియోకి చేరవేస్తుందని రానా ట్విట్టర్ ద్వారా తెలిపారు.

  • Loading...

More Telugu News