: మూడోసారి 'సెక్సియెస్ట్ ఉమెన్'గా ప్రియాంక చోప్రా


బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా హవా కొనసాగుతోంది. తాజాగా ఈ అమ్మడు 'ఆసియా సెక్సియెస్ట్ ఉమెన్'గా ఎంపికైంది. వరసగా నాలుగు సంవత్సరాల్లో మూడు సార్లు ఈ అవార్డును దక్కించుకోవడం గమనార్హం. లండన్ కు చెందిన 'ఈస్ట్రన్ ఐ' అనే వారపత్రిక సామాజిక మాధ్యమాల ద్వారా నిర్వహించిన పోల్ లో ఎక్కువ మంది పీసీకే ఓటు వేశారు. దానిపై ప్రియాంక చాలా సంతోషం వ్యక్తం చేసింది. తనకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ, అలాగే దీనిని నిర్వహించిన ఈస్ట్రన్ ఐ పత్రికకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పింది. తాను మళ్లీ ఘనతను దక్కించుకోవడం ఆనందంగా ఉందని పేర్కొంది. కాగా పత్రిక జాబితాలోని తొలి యాభై స్థానాల్లో భారత్ కు చెందిన కథానాయికలు ఉన్నారు. దీపిక పదుకొణె నాలుగు, కత్రినా కైఫ్ ఐదవ స్థానాల్లో నిలిచారు.

  • Loading...

More Telugu News