: ఈ నేలను వదిలి మేమెందుకు వెళ్లాలి?: జగన్ సభలో స్థానికులు
బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ చింతపల్లిలో చేపట్టిన నిరసన దీక్షలో స్థానికులు మాట్లాడుతూ, 'మా ముత్తాతలు, తాతలు, తండ్రులు ఇదే నేలలో పుట్టారు, ఇదే నేలలో గిట్టారు. అంత గొప్ప నేలను వదిలి, డబ్బులిస్తాము వెళ్లిపొమ్మంటున్నారు. మేమెందుకు వెళ్లాలి?' అని నిలదీశారు. ఇక్కడ పంటలు పండించుకుని బతుకుతున్నామని, వాటిని వదిలేసి ముక్కూ మొహం తెలియని ఊరికి ఎందుకు వెళ్లాలని అడిగారు. కష్టమైనా నష్టమైనా ఇక్కడే బతికాం, ఇక్కడే బతుకుతామని వారు పేర్కొన్నారు. బాక్సైట్ తవ్వకాలను పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.