: గ్రేటర్ లో ఎగిరేది టీఆర్ఎస్ జెండానే!: తలసాని


త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గ్రేటర్ లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ వస్తే ఆంధ్ర వాళ్లను ఇక్కడ ఉండనీయరని పుకార్లు లేపారని... కానీ, ఇప్పుడు అంతా అన్నదమ్ముల్లా కలసిమెలసి ఉంటున్నామని చెప్పారు. వరంగల్ ఉప ఎన్నికలో తిమ్మిని బమ్మి చేయాలని ప్రతిపక్షాలు చూశాయని... అయినా వారి పాచికలు పారలేదని అన్నారు. టీఆర్ఎస్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారని తెలిపారు. రైతుల ఆత్మహత్యలు ఇప్పుడే కొత్తగా పుట్టుకొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణను బంగారు తెలంగాణ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కలలు కంటున్నారని చెప్పారు.

  • Loading...

More Telugu News