: రాష్ట్రపతి పర్యటనపై సమీక్ష నిర్వహించిన సీఎస్


భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్ విచ్చేస్తున్నారు. శీతాకాల విడిదిలో భాగంగా ఆయన భాగ్యనగరికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రపతి పర్యటన, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలపై అధికారులతో ఆయన చర్చించారు. బొల్లారంలోని అతిథి గృహంలో ఈ నెల 18 నుంచి 31వ తేదీ వరకు రాష్ట్రపతి బస చేయనున్నారు. తన పర్యటన సందర్భంగా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహిస్తున్న చండీయాగానికి కూడా రాష్ట్రపతి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.

  • Loading...

More Telugu News