: ఛత్తీస్ గఢ్ లో మావోల దాడి... జవాను మృతి
ఛత్తీస్ గఢ్ లోని నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టులు దాడికి పాల్పడ్డారు. ఆర్మీ శిబిరంపై చేసిన దాడుల్లో ఆర్మీ ఫోర్స్ కు చెందిన జవాను అశ్వినీ సింగ్ రాజ్ పుత్ మరణించాడు. ఈ విషయాన్ని నారాయణపూర్ జిల్లా ఎస్పీ అభిషేక్ మీనా వెల్లడించారు. ఈ తెల్లవారుమజామన ఆర్మ్ డ్ శిబిరం వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు దాడి చేసి కాల్పులకు దిగారని చెప్పారు. వెంటనే అప్రమత్తమైన ఆర్మీ సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారన్నారు. ఈ కాల్పుల్లోనే జవాను చనిపోయాడని ఎస్పీ వివరించారు. ప్రస్తుతం వారికోసం జవాన్లు అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్నారని మీనా పేర్కొన్నారు.