: వ్యూహం మార్చిన సోనియా, రాహుల్... కోర్టు మెట్లెక్కేందుకు రెడీ!


నేషనల్ హెరాల్డ్ ఆస్తుల కేసులో వ్యవహరించాల్సిన తీరుపై కాంగ్రెస్ పార్టీ వ్యూహం మార్చింది. ఢిల్లీ కోర్టు ఆదేశాలను సుప్రీంలో సవాలు చేయాలని తొలుత భావించిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్టు తెలుస్తోంది. బీజేపీ రాజకీయ ప్రతీకారం తీర్చుకునే ఉద్దేశంలో భాగంగానే కేసును తోడుతోందని ఆరోపించిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్, కేసు విచారణలో భాగంగా కోర్టుకు హాజరు కావాలని భావిస్తున్నారు. ఈ విషయంపై సీఎన్ఎన్-ఐబీఎన్ ప్రత్యేక కథనం ప్రచురించింది. సుప్రీంకోర్టుకు వెళ్లకుండా ఢిల్లీ హైకోర్టు ముందు హాజరు కావాలని వారు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. కాగా, ఈ కేసులో 19వ తేదీన సోనియా, రాహుల్ లు హాజరు కావాలని కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. కేసు విచారణలో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని వీరు కోరగా, కోర్టు నిరాకరించింది. సోనియా, రాహుల్ తరఫున సీనియర్ న్యాయవాదులు డాక్టర్ అభిషేక్ మను సంఘ్వీ, హరీన్ రావల్, రమేష్ గుప్తాలు వకాల్తా తీసుకున్నారు.

  • Loading...

More Telugu News