: ఇందిర కోడలైనా, రాజీవ్ భార్య అయినా శిక్ష అనుభవించాల్సిందే: రాయపాటి
టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు దత్తత తీసుకున్న ధర్మవరం గ్రామ అభివృద్ధికి గెయిల్ సంస్థ సాయం అందించింది. రూ. 8.95 కోట్లతో గ్రామ అభివృద్ధికి ప్రణాళికలు రచించింది. ఇందులో భాగంగా, తొలి విడతగా రూ. 2 కోట్ల సాయం అందించింది. గ్రామాన్ని సందర్శించిన గెయిల్ బృందం ఆ తర్వాత రాయపాటితో భేటీ అయింది. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత రాయపాటి మీడియాతో మాట్లాడారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీ దోషి అని తేలితే చట్ట ప్రకారం శిక్ష అనుభవించాల్సిందే అని రాయపాటి చెప్పారు. ఇందిరాగాంధీ కోడలైనా, రాజీవ్ గాంధీ భార్య అయినా చట్టం ముందు ఒకటే అని అన్నారు. విభజన సమయంలోనే ప్రత్యేక హోదా అంశాన్ని చట్టబద్ధం చేసి ఉంటే, ఇప్పుడు మనకు ఈ ఇబ్బందులు వచ్చి ఉండేవి కాదని మండిపడ్డారు.