: మాయమాటలు చెప్పే దొంగబ్బాయితో జాగ్రత్త!: నారా లోకేశ్


మన దురదృష్టం కొద్దీ మాయ మాటలు చెప్పే దొంగబ్బాయి ఇక్కడ ఉన్నాడని, అతనితో జాగ్రత్తగా ఉండాలని.. ఆ మాటలను ప్రజలు నమ్మవద్దని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో నిర్వహించిన జనచైతన్య యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘దొంగబ్బాయి ఎట్లాంటి మాయమాటలు చెబుతారని మీరు నన్ను ప్రశ్నించవచ్చు. దానికి కొన్ని ఉదాహరణలు నేను చెబుతాను. రాయలసీమను రత్నాలసీమగా మార్చే ఉద్దేశ్యంతో పట్టిసీమ ప్రాజెక్టును చంద్రబాబు ప్రారంభించారు. ఆ ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు దొంగబ్బాయి ఏమి చేశాడు? గోదావరి జలాలన్నింటిని రాయలసీమకు తరలిస్తున్నారంటూ అక్కడి ప్రజలకు దొంగబ్బాయి నూరిపోశాడు. అదే దొంగబ్బాయి... రాయలసీమకు వచ్చి, పట్టిసీమ నుంచి ఒక్క చుక్క నీరు కూడా మనకు రాదని చెప్పాడు. ఇవి మాయమాటలు కాదా? అంతేకాకుండా.. రాయలసీమకు చంద్రబాబు నాయుడు అన్యాయం చేస్తున్నాడంటూ దొంగబ్బాయి కొత్త స్వరం ఆలపిస్తున్నాడు. ఈ సందర్భంగా ఆ దొంగబ్బాయికి ఒక ప్రశ్న వేస్తున్నాను. మీ నాన్న, వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఒక్క ప్రాజెక్టు అయినా రాయలసీమకు వచ్చిందా? ఎవ్వరైనా పెట్టుబడులు పెట్టారా?’ అంటూ లోకేశ్ చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News