: టీడీపీ-బీజేపీ కార్యకర్తల మధ్య కొట్లాట
మిత్రపక్షాలైన టీడీపీ-బీజేపీ కార్యకర్తల మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ వివాదం ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేంత వరకు వెళ్లింది. హైదరాబాదులోని ఉప్పల్ లో టీడీపీ-బీజేపీ కార్యకర్తల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. గ్రేటర్ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పనిచేస్తూ, పార్టీల ప్రతిష్ఠ పెంచడంపై కార్యకర్తలకు పాఠాలు బోధించాలని నేతలు సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశం కోసం ఏర్పాటు చేసిన వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో టీడీపీ సీనియర్ నేత దేవేందర్ గౌడ్ ఫోటో లేకపోవడంపై టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న వాగ్వాదం రెండు పార్టీల కార్యకర్తలు కొట్టుకునేంత వరకు దారితీసింది. దీంతో సమావేశం రసాభాసగా మారింది.