: అనంతపురం జిల్లా హత్యకేసులో 14 మందికి జీవిత ఖైదు
అనంతపురం జిల్లా గుత్తి అదనపు మెట్రోపాలిటన్ జడ్జి వెంకటరమణారెడ్డి కీలక తీర్పును వెలువరించారు. హత్యకేసులో 14 మందికి జీవిత ఖైదును విధిస్తూ తీర్పు చెప్పారు. 2011 జులై 18వ తేదీన పెద్దవడుగూరు మండలం ముప్పాళ్లగుత్తి గ్రామంలోని శివాలయంలో శివయ్య అనే వ్యక్తి పూజలు నిర్వహిస్తుండగా... అదే గ్రామానికి చెందిన 16 మంది వేటకొడవళ్లతో దాడి చేసి హత్య చేశారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఈ రోజు జడ్జి తీర్పును వెలువరించారు. మొత్తం 16 మందిలో ఇద్దరిని నిర్దోషులుగా పేర్కొన్న జడ్జి... మిగిలిన వారికి జీవిత ఖైదు విధించారు. జీవిత ఖైదు పడిన వారు వీరే... గిరిప్రసాద్, కంబయ్య, భద్రువాహన, రాముడు, చిన్న సంజప్ప, కోదండరాముడు, రంగారెడ్డి, మహేష్, శంకరప్ప, రంగస్వామి, ఎర్రిస్వామి, కేశవయ్య, నాగరాజు, బాలరంగడు.