: ఇక అరచేతిలో తెలంగాణ నేరస్తుల వివరాలు: డీజీపీ


తెలంగాణ రాష్ట్రంలో నేరాలను అరికట్టే దిశగా అందివచ్చిన అధునాతన సాంకేతికతను విరివిగా వినియోగించుకుంటున్నట్టు డీజీపీ అనురాగ్ శర్మ వివరించారు. ఈ సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నేరాల అదుపునకు సరికొత్త యాప్స్ వాడుతూ ముందుకు సాగుతున్నట్టు వెల్లడించారు. ఇందులో భాగంగా క్రిమినల్ డేటా ఎనాలిసిస్ ను రూపొందిస్తున్నామని, దీని సాయంతో నేరం జరిగిన తరువాత క్షణాల్లో అది ఏ పాత నేరస్తుడి పని? అన్న విషయం తెలిసి పోతుందని అన్నారు. ఏదైనా కేసు నమోదైతే, దాని ఎఫ్ఐఆర్ నుంచి పోలీసులు తీసుకునే అన్ని చర్యల వరకూ ఆన్ లైన్లో ప్రజలకు అందుబాటులో ఉంచుతామని అనురాగ్ శర్మ వివరించారు. వాణిజ్య సముదాయాలు, రద్దీ ప్రాంతాల్లో మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అనుక్షణం ప్రజా భద్రతే లక్ష్యంగా పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News