: గాయకుడు శంకర్ మహదేవన్ కు హార్ట్ అటాక్
ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు శంకర్ మహదేవన్ కు హార్ట్ అటాక్ వచ్చింది. అకస్మాత్తుగా ఆయనకు గుండె పోటు రావడంతో ఆయనను హుటాహుటీన ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. అయితే ఆయనను పరీక్షించిన వైద్యులు యాంజియో ప్లాస్టీకి పంపారు. అదృష్టవశాత్తు మేజర్ బ్లాకులు లేవని శంకర్ మహదేవన్ కుమారుడు సిద్ధార్థ్ మహదేవన్ తెలిపాడు. అలసట, ఒత్తిడి మూలంగా గుండెపోటు వచ్చినట్టు ఆయన వెల్లడించాడు. ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నారని, త్వరలోనే డిశ్చార్జ్ చేస్తారని సిద్ధార్థ్ మహదేవన్ చెప్పారు. కాగా, శంకర్ మహదేవన్ హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, మరాఠీ, బెంగాలీ భాషల్లోని పలు సినిమాల్లో పాటలు పాడాడు.