: 2016లో జరిగే 'టెక్' మార్పులివే: మైక్రోసాఫ్ట్ అంచనాలు


మైక్రోసాఫ్ట్ రీసెర్చ్... దాదాపు 1000 మంది నిష్ణాతులతో ప్రపంచ టెక్ రహదారులకు దిశానిర్దేశం చేస్తున్న విభాగం. భవిష్యత్ లో మానవ జీవితం మరింత సుఖంగా, సౌకర్యంవంతంగా సాగేందుకు ఇక్కడ నిత్యమూ రీసెర్చ్ జరుగుతుంటుంది. గత 25 ఏళ్లుగా ఎన్నో అద్భుత టెక్నాలజీ ఆవిష్కరణలను ప్రపంచం ముందు ఉంచింది. ఇక వచ్చే సంవత్సరంలో వరల్డ్ టెక్నాలజీ ఎలా మారనుందన్న విషయమై మైక్రోసాఫ్ట్ కొన్ని అంచనాలు వేస్తోంది. వాటి వివరాలివి... సరికొత్త సిలికాన్ ఆర్కిటెక్చర్లు: కంప్యూటర్లను మరింత వేగవంతం చేసేలా సరికొత్త సిలికాన్ పరికరాలు వస్తాయి. వీటిని ప్రాసెసర్ల తయారీలో వాటడం ద్వారా మరింత సౌకర్యంగా స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు వాడవచ్చు. కెమెరా టెక్నాలజీ మరింత ఉన్నత స్థితికి వెళుతుంది. అంతా క్లౌడ్ మయం: 2016లో క్లౌడ్ కంప్యూటింగ్ మరింత బలపడుతుంది. డేటా నష్టపోకుండా ఉండేందుకు అందరూ ఈ విధానానికి జేజేలు పలుకుతారు. నోట్స్ తీసుకున్నా, డ్రాయింగ్ వేసినా టాబ్లెట్ లలోనే: టాబ్లెట్ల వాడకం మరింత విస్తరిస్తుంది. స్టైలస్ తో రాసినా, టైప్ చేసుకున్నా, బొమ్మలు గీసినా, నిర్మాణ రంగ డిజైన్లు గీసినా అన్ని టాబ్లెట్ లలో జరుగుతుంది. కన్స్యూమర్ టెక్ ఇండస్ట్రీ టాబ్లెట్ ల వైపు వెళుతుంది. ప్రతి ఒక్కరికీ ఏ పీఏ: వర్చ్యువల్ అసిస్టెంట్ రూపంలో యువతి లేదా యువకుడు మీకు పర్సనల్ అసిస్టెంట్ గా వస్తారు. మీ పనులు, ఆదాయ, వ్యయాలు, అపాయింట్ మెంట్లు, నిరుద్యోగులైతే ఉద్యోగాన్వేషణ వంటి వన్నీ చేసి పెడుతుంది. యువకులు వర్చ్యువల్ అసిస్టెంట్ కు బానిసలవుతారు. నిబంధనలు తెలుస్తాయి: భారీ స్థాయిలో సమాచారాన్ని అంతర్జాలం నుంచి తీసుకునే ముందు నియమ నిబంధనలు, వాటిని పాటించకుంటే ముప్పు గురించి అత్యధికులకు తెలుస్తుంది. కంప్యూటర్లకు మరింత బాగా అర్థం అవుతుంది: తనను వాడుతున్న వ్యక్తికి ఏం కావాలన్నది కంప్యూటర్లకు మరింతగా అర్థం అవుతుంది. కావాల్సిన సమాచారాన్ని అవి క్రోఢీకరించి చూపుతాయి. భవిష్యత్ హెల్త్ టెక్నాలజీదే: వైద్య ఆరోగ్య రంగంలో సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతుంది. మానవుల ఆయుర్దాయం పెంచేందుకు, కఠిన రోగాల నుంచి ఉపశమనానికి ఈ టెక్నాలజీ దోహదపడుతుంది. కంప్యూటర్లూ మాట్లాడతాయి: రెస్పాన్స్ కావడానికి బదులుగా, కంప్యూటర్లు సంభాషించడం మొదలు పెడతాయి. చిన్న సమస్యలకు చిటికెలో పరిష్కారం చెబుతాయి. పర్యావరణ పరిరక్షణ సులువు అవుతుంది: అందివచ్చే అధునాతన సాంకేతికత పర్యావరణానికి జరుగుతున్న నష్టాన్ని మరింత కచ్ఛితంగా చెబుతుంది. దీంతో మానిటరింగ్ తో పాటు నియంత్రణా సులువవుతుంది. సెక్యూరిటీ నిపుణులకు పని ఎక్కువే: సైబర్ నేరాలు పెరిగి కొత్త సవాళ్లను విసురుతాయి. కంప్యూటర్ వ్యవస్థకు తగినంత రక్షణ కోసం సెక్యూరిటీ నిపుణులు మరింతగా కృషి చేయాల్సి వుంటుంది.

  • Loading...

More Telugu News