: వారిద్దరినీ పక్కన పెట్టుకుని జగన్ మద్యనిషేధంపై మాట్లాడటం హాస్యాస్పదం: సోమిరెడ్డి


విజయవాడలో కల్తీ మద్యం ఘటన నేపథ్యంలో ఏపీలో సంపూర్ణ మద్య నిషేధం విధించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ డిమాండ్ చేయడాన్ని టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హేళన చేశారు. తన పార్టీ నేతలు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావులను పక్కనే పెట్టుకుని జగన్ మద్యపాన నిషేధంపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. బొత్స కుటుంబంపై కల్తీ మద్యం కేసులు ఇంకా ఉన్నాయని చెప్పారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సోమిరెడ్డి మాట్లాడారు. వైఎస్ పరిపాలన కాలంలో మద్యం ఏరులై పారిందని, కాంగ్రెస్ హయాంలో కల్తీ మద్యం వల్ల పదుల సంఖ్యలో జనం చనిపోయారని చెప్పారు. కల్తీ మద్యం ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని, అందుకు నిదర్శనంగానే ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసిందని సోమిరెడ్డి వివరించారు.

  • Loading...

More Telugu News