: వచ్చే ఏడాది పాకిస్థాన్ లో పర్యటించనున్న మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ 2016లో దాయాది దేశం పాకిస్థాన్ లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మ స్వరాజ్ వెల్లడించారు. ఇస్లామాబాద్ లో జరుగుతున్న 'హార్ట్ ఆఫ్ ఏసియా' సదస్సుకు హాజరైన ఆమె... ఈ విషయాన్ని అక్కడే తెలిపారు. పాక్ లో జరిగే సార్క్ శిఖరాగ్ర సమావేశాలకు ప్రధాని హాజరవుతారని చెప్పారు. మోదీతో పాటు తాను కూడా వస్తానని తెలిపారు. 2004లో చివరి సారిగా ఓ భారత ప్రధాని పాక్ ను సందర్శించారు. అప్పుడు జరిగిన సార్క్ సమ్మిట్ కు అనాటి ప్రధాని వాజ్ పేయి హాజరయ్యారు. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ భారత ప్రధాని పాక్ లో అడుగుపెట్టనున్నారు.