: పితృత్వాన్ని ఆస్వాదిస్తున్న జుకెర్ బర్గ్


ఫేస్ బుక్ లోని తన వాటాకు చెందిన షేర్లలో 99 శాతం షేర్లను సమాజ సేవకు అంకితం చేసిన ఆ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో మార్క్ జుకెర్ బర్గ్ ప్రస్తుతం పెటర్నిటీ లీవును పూర్తి సంతోషంగా గడుపుతున్నాడు. నాలుగు నెలల పాటు పెటర్నిటీ లీవు తీసుకున్న జుకెర్ బర్గ్ ప్రస్తుతం తండ్రి హోదాను అనుభవిస్తున్నాడు. ఈ విషయం అందరితో పంచుకున్నాడు. ఫేస్ బుక్ లో తన కూతురితో ఉన్న ఫోటోను పోస్టు చేసి, 'చాలా సంతోషంగా బుల్లి మ్యాక్స్ తో' అంటూ క్యాప్షన్ జత చేశాడు. దీనికి నెటిజన్ల నుంచి విశేషమైన ఆదరణ లభించింది. దీనిని పోస్టు చేసిన కొన్ని గంటల్లోనే 22 లక్షల మంది లైక్ చేయగా, 18000 మంది షేర్ చేసుకోవడం విశేషం.

  • Loading...

More Telugu News