: బీఫ్ ఫెస్టివల్ కు హైకోర్టులో కూడా అనుమతి నిరాకరణ


ఉస్మానియా యూనివర్శిటీలో నిర్వహించ తలపెట్టిన బీఫ్ ఫెస్టివల్ కు ఉమ్మడి హైకోర్టు కూడా అనుమతి తిరస్కరించింది. ఈ మేరకు సిటీ సివిల్ కోర్టు రెండు రోజుల కిందట ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఎలాంటి ఫెస్టివల్స్ నిర్వహించకూడదని, యథాతథ స్థితి కొనసాగించాలంటూ ఇచ్చిన ఉత్తర్వులను అమలు పరచాల్సిందేనని ఆదేశించింది. బీఫ్ ఫెస్టివల్ నిర్వహించకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది. దానిపై కడెం రాజు అనే వ్యక్తి వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు పైవిధంగా స్పందించింది. పోలీసులు శాంతి భద్రతలు కాపాడాలని ఆదేశాలిచ్చింది. మరోవైపు ఫెస్టివల్ నిర్వహించి తీరుతామని ప్రజాస్వామ్య సాంస్కృతిక వేదిక (డీసీఎఫ్) సన్నాహాలు చేస్తోంది.

  • Loading...

More Telugu News