: విజయవాడ కల్తీ మద్యం ఘటనపై విచారణకు సిట్ ఏర్పాటు
విజయవాడ కృష్ణలంకలోని స్వర్ణబార్ లో చోటుచేసుకున్న కల్తీ మద్యం ఘటనపై విచారణకు ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సీనియర్ ఐపీఎస్ అధికారి మహేశ్ చంద్ర లడ్డా నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేశారు. ఇందులో గ్రేహౌండ్స్ ఎస్పీ సెంథిల్ కుమార్, డీఎస్పీలు టి.కనకరాజు, ఎం.వెంకటేశ్వరరావు, సీఐలు వైవీనాయుడు, కె.శ్రీనివాసరావు, అబ్దుల్ కరీం, సీహెచ్ రాంబాబు, మీరా సాహెబ్ లను నియమించారు. విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ ఆధ్వర్యంలో సిట్ పనిచేయనుంది.