: కోల్ కతాలోని సాల్ట్ లేక్ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం
కోల్ కతాలోని సాల్ట్ లేక్ ప్రాంతంలోని ఇన్ఫినిటీ బెంచ్ మార్క్ భవనంలో ఈరోజు ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. ఐటీ కంపెనీలకు కేంద్రంగా ఉన్న ఈ 18 అంతస్తుల భవనంలోని ఆరో అంతస్తులో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది 7 ఫైరింజన్లతో ఘటనాస్థలికి వచ్చి మంటలార్పారు. భవనంలోని 50 మందిని బయటికి తరలించారు. భవనంలోని సర్వర్ రూం నుంచి మంటలు వ్యాపించినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిసింది.