: నా కోసమే నేను సినిమాలు నిర్మిస్తున్నా: అనుష్క శర్మ


బాలీవుడ్ ముద్దుగుమ్మ అనుష్క శర్మ హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉండగానే... సినీ నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టింది. 'ఎన్ హెచ్ 10' సినిమాతో ఆమె నిర్మాతగా మారింది. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలను సైతం పొందడంతో... ప్రొడక్షన్ పై అనుష్క మరింత దృష్టిని సారించింది. ఈ క్రమంలో, ఒకేసారి మూడు సినిమాలను నిర్మించడానికి ఆమె సిద్ధమవుతోంది. ఇప్పటికే రెండు సినిమాల కథ, కథనాలు రెడీ అయ్యాయని... మరో కథకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని అనుష్క తెలిపింది. ఈ సినిమాల్లో ఒక దానికి ఎన్ హెచ్ 10 దర్శకుడు నవదీప్ సింగ్ దర్శకత్వం వహిస్తుండగా... మిగిలిన రెండు చిత్రాలకు అన్షయ్ లాల్, అక్షంత్ వర్మ డైరెక్షన్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా అందాల అనుష్క శర్మ మాట్లాడుతూ, "నా కోసమే నేను సినిమాలను నిర్మిస్తున్నా" అంటూ స్మైల్ ఇచ్చింది.

  • Loading...

More Telugu News