: లోదుస్తులపై ముఖ్యమంత్రి ఫొటో... వ్యక్తి అరెస్ట్


సాక్షాత్తు ముఖ్యమంత్రి ఫొటోను లోదుస్తులపై ముద్రించిన నేరానికి ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్లే, తమిళనాడులోని కారైకూడిలో శరవణన్ అనే వ్యక్తి గణేష్ టెక్స్ టైల్స్ పేరుతో ఓ షాపు నడుపుతున్నాడు. లోదుస్తులపై ముఖ్యమంత్రి జయలలిత ఫొటోలను ముద్రించి... వాటి ఫొటోలను స్నేహితులకు పంపించాడు. ఈ విషయం తెలుసుకున్న అన్నాడీఎంకే పార్టీ నేతలు ఇతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సెక్షన్ల కింద శరవణపై పై పోలీసులు కేసు పెట్టారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత విచారణలో బయటపడిన విషయం ఏమిటంటే... చెన్నై వరద బాధితులకు అందించే సాయంపై జయలలిత ఫొటో ఉండాలని అన్నాడీఎంకే కార్యకర్తలు పట్టుబట్టారట. దీంతో, ఒళ్లు మండిన శరవణన్ ఈ పని చేశాడట. శరవణన్ చేసిన పనికి, రాజకీయాలకు ఎలాంటి సంబంధాలు లేవని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News