: ఇంద్రాణి, సంజీవ్, రాయ్ లకు మరోమారు ఇంటరాగేషన్


కార్పొరేట్ భారతావనిలో సంచలనం సృష్టించి, హైప్రొఫైల్ మర్డర్ మిస్టరీగా నిలిచిన షీనాబోరా కేసులో ప్రధాన నిందితులు ఇంద్రాణి ముఖర్జియా, ఆమె రెండో భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామవర్ రాయ్ లను మరోమారు ఇంటరాగేషన్ చేసేందుకు సీబీఐకి ప్రత్యేక కోర్టు అంగీకారం తెలిపింది. ఈ కేసులో న్యాయమూర్తి ఎదుట సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాల కాపీలను తనకు ఇవ్వాలంటూ, ఇంద్రాణి ముఖర్జియా కోరగా, అందుకు సైతం న్యాయస్థానం అంగీకరించింది. సీబీఐ విచారించిన సాక్షులు ఏం చెప్పారన్నది సీల్డ్ కవర్లో ఉంచి ఈ నెల 17న ఇవ్వాలని న్యాయమూర్తి హెచ్ఎస్ పాటిల్ ఆదేశించగా, చాలా పెద్ద కుట్ర దాగున్న ఈ కేసులో ఎంతో లోతుగా దర్యాఫ్తు జరుగుతోందని, ప్రస్తుత పరిస్థితుల్లో సాక్షుల వాగ్మూలం నిందితులకు చేరడం ప్రమాదకరమని స్పెషల్ పీపీ కవితా పాటిల్ వాదించారు. కేసు విచారణను ముగించేందుకు మరింత సమయం పడుతుందన్నారు.

  • Loading...

More Telugu News